ఆర్ఓఎఫ్ఆర్ భూములు పరిశీలించిన పీఓ..


Ens Balu
2
కించుమండ
2020-09-16 13:39:04

విశాఖ ఏజెన్సీలోని అటవి హక్కు పత్రాలు పంపిణీకి అవసరమైన భూమి సర్వేను పక్కాగా నిర్వహించాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల పరిశీలిం చారు. బుధవారం కించుమండ పంచాయతీ కోసమగుడ గ్రామపరిధిలోని కొండపై గిరిజనులు సాగుచేస్తున్న భూములను పరిశీలించారు. మండలంలో చేసిన సర్వే వివరాలను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.గిరిజన రైతుల సాగులో ఉన్నభూములను సక్రమంగా నమోదు చేయాలని చెప్పారు. 216 కుటుంబాల  అర్హులను గుర్తించామని రెవెన్యూ అధికారులు వివరించారు. 127మంది అటవీ భూములు సాగుచేస్తున్నారని చెప్పారు.29 కుటుంబాలకు భూములు లేవన్నారు. ల్యాండ్ సర్వే వేగంగాపూర్తి చేయాలని పి.ఓ. ఆదేశించారు. అనంతరం కురిడి గ్రామంలో రూ 42లక్షలు వ్యయంతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న రైతుభరోసా కేంద్రం నిర్మాణపు పనులు తనిఖీ చేశారు.  ఆతరువాత అరకులో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం పనులను తనిఖీ చేసి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరకులో వై ఎస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యతలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కెజయప్రకాశ్ రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ జి.మురళి,ఏ ఈ ఈ యద కిషోర్,ఎం. పిడివో ఛాయ సుధ , డిటి.విఆర్వో తదితరులు  పాల్గొన్నారు.