రాష్ట్ర ప్రగతికి రహదారులే చిహ్నం.. డిప్యూటీ సీఎం


Ens Balu
3
సావరకోట
2022-03-02 05:54:44

ఎక్కడైతే రోడ్ నెట్ వర్క్ బాగుంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రోడ్లు మన అవసరం మాత్రమే కాదని, మన ప్రాణాన్ని రక్షించి భద్రతను ఇచ్చేవని చెప్పారు. సారవకోట మండలంలో రూ.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వడ్డెనవలస - కొమ్మనాపల్లి, పాకి వలస - జమచక్రం రెండు రోడ్లకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో రహదారులు గణనీయంగా అభివృద్ధి చెందాయని అన్నారు. రాష్ట్రంలోని 46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టామని ఇప్పటికే  70 '
శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2022 జూన్ కల్లా రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.  నాడు-నేడు తరహాలో ప్రతీ రోడ్డు కూడా ఫోటోలు తీయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ బి.లాటకర్, పాలకొండ ఆర్టిఓ టీ వీ జే ఎస్ కుమార్, ఆర్అండ్బి ఎస్.ఈ బి. కాంతిమతి, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మి నాయుడు, జడ్పీటీసీ వరుదు నాగేశ్వరి, పలువురు ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు