ఖచ్చితమైన పనివేళలు పాటించాలి.. డిప్యూటీ సీఎం
Ens Balu
4
సావరకోట
2022-03-02 06:17:21
ఉపాధి హామీ పథకంలో వేతన దారులకు మూడు గంటల కనీస ఖచ్చితమైన పనివేళలు ఉండేలా చూడాలని, ఏదో వస్తున్నాం.. వెళ్తున్నాం.. అనేలా ఉండకూడదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రైతులకి రానున్న ఖరీఫ్ సీజన్లో ఉపయోగపడేలా ఉపాధి హామీ పనులను గుర్తించాలని సూచించారు. ధర్మ లక్ష్మీపురం సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి.లాటకర్ తో కలిసి బుధవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగిన డిప్యూటీ సీఎం రికార్డులను తనిఖీ నిర్వహించారు. పేరుపేరునా సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకుని వారు నిర్వహిస్తున్న విధులను అడిగారు. అంతకు మునుపు ఆయన చిన్న కిట్టాలపాడు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు డి- వార్మింగ్ మాత్రలను వేశారు. కొద్దిసేపు వారితో ముచ్చటించారు. పాఠ్యాంశాలలో పలు ప్రశ్నలు అడిగారు. భోజనం నాణ్యత గురించి ప్రశ్నించారు. పాలకొండ ఆర్టిఓ టీ వీ జే ఎస్ కుమార్, ఆర్అండ్బి ఎస్.ఈ బి. కాంతిమతి, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మి నాయుడు, జడ్పీటీసీ వరుదు నాగేశ్వరి, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.