సంపూర్ణ పోషణ కిట్లను సద్వినియోగం చేసుకోవాలి..


Ens Balu
3
Sankhavaram
2020-09-16 14:41:31

గర్భిణీ మహిళలకు ప్రభుత్వం అందజేసే సంపూర్ణ పోషణ పథకం యొక్క బలవర్థక ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని శంఖవరం గ్రామసచివాలయ మహిళా సంక్షరక్షణా కార్యదర్శి జిఎన్ఎస్ శిరీష అన్నారు. బుధవారం ఎస్సీ దుర్గాకాలనీలోని అంగన్ వాడీ కేంద్రంలోని గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందించిన టిహెచ్ ఆర్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మరింత మెరుగు పరచడం కోసం ఈ కిట్లను అందజేస్తుందని, వీటిని తీసుకోవడంతోపాటు ఆకు కూరలు కూడా విరివిగా తీసుకోవాలన్నారు. తద్వారా రక్తం పెరిగి కాన్పు సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని సూచిం చారు. ప్రతినిత్యం కోడిగ్రుడ్డు, పాలు, ఆహారంలో పప్పు ఆకు కూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ కేసులు అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు, సామాజిక దూరం పాటించాలన్నారు. ఏ పనిచేసినా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే, తక్షణమే ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం అందించి, పీహెచ్సీలోనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, కుటుంబ సభ్యులు కూడా వైరస్ భారిన పడేప్రమాదముందని హెచ్చరించారు.  పోషణ్ అభియాన్, పోషణ సంబరాలు కార్యక్రమాలు ప్రతీ అంగన్ వాడీ కేంద్రాల్లోనూ ఈనెల 22వ తేదీవరకూ నిర్వహిస్తున్నట్టు శిరీష వివరించారు. కార్యక్రమంలో అంగన్ వాడీ కార్యకర్త, తదితరులు పాల్గొన్నారు.