ఆ ఎస్ఐ కిరికిరి...బొలిశెట్టిపై కేసులు పక్కదారి..!


Ens Balu
2
s.rayavaram
2020-09-16 18:31:03

అధికారం చేతిలో ఉంటే బమ్మిని తిమ్మి..తిమ్మిని బమ్మీ చేయవచ్చు..అధికారపార్టీ నేతగా చేసే అక్రమాలకు పోలీసుల సహకారం ఉంటే పెట్టిన కేసులు కూడా కాగి తాలపై సాక్ష్యాలు లేకుండా మాయం చేసేయవచ్చు..అధికారం, ప్రతీపనికీ కాసులు కక్కుర్తి పడే అధికారులున్నంత సేపు అక్రమార్కుల ఆగడాలు నిరాటంకంగా కొనసాగుతాయనడానికి విశాఖ జిల్లా, ఎస్.రాయవరంలోని మాజీ ఎంపీటీసీ బొలిశెట్టి చేసిన అవినీతి వ్యవహరాలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వాటన్నింటిపైనా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా, సదరు వ్యక్తిపై కనీసం ఒక్క కేసుకి సంబంధించిన ఆధారాలు కూడా స్టేషన్ లో లేవంటే పరిస్థితి ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయంపై దళిత సంఘాల సమాఖ్య కన్వీనర్ డా.బూసి వెంకట్రావు బుధవారం మీడియాకి లిఖిత పూర్వకంగా విడుదల చేసిన వివరాలు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్ముతాయ్.ఇన్ని కేసులన్న వ్యక్తిని అధికారపార్టీలో ఎలా కొనసాగిస్తున్నారోననే ప్రశ్న తలెత్తక మానదు..బొలిశెట్టి అక్రమాలపై దళిత ఐఖ్యవేదిక నేత విడుదల చేసిన ఆ వివరాలు వరసుగా..  పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై 9.9.2020న అనుచిత వ్యాఖ్యలు చేసినందున బొలిశెట్టిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేను దూషించినట్టే 7.9.2020 న పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త, యాదవ కులస్థుడైన మామిడి చంటిపై కూడా దౌర్జన్యం చేసి, అతన్ని కూడా కులం పేరుతో దూషించిన కేసు బొలిశెట్టిపై నమోదు చేయాలి ఎస్.రాయవరంలోని సోమిరెడ్డి ఆదినాగ మణికుమార్ ఇంటిపై దౌర్జన్యం చేసి ప్రహారీ గోడను బొలిశెట్టి పడగొట్టించగా అతనితో పాటు మరో ఐదుగరుపై 6.1.2018న అప్పటి ఎస్.ఐ. కుమార స్వామి కేసు (141/ 2018) నమోదైన కేసుపై విచారణచేయాలి  బొలిశెట్టికి వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ తర్వాత ఎస్ఐ. రాజాన ధనుంజయ్ తో ఆ కేసును మూసివేయించు  తర్వాత సోమిరెడ్డి ఆది నాగ మణికుమార్ యలమంచిలి కోర్టులో కేసును పునఃప్రారం భించాలని వేసిన కేసుపై దర్యాప్తు చేయాలి ఎస్.రాయవరం గురజాడ కళాక్షేత్రానికి అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనిత శిలాఫలకాన్ని వేయగా 27.4.2020న దానిని అక్రమంగా తొలగించగా దీనిపై అదే రోజు ఎస్.ఐ. రాజాన ధనుంజయ్ కి ఫిర్యాదు చేయగా, ఆ కేసులో తను, మరో ఇద్దరిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు కాకుండా తొక్కిపెట్టిన అంశాపై చర్యలు తీసుకోవాలి.  ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేసిన శిలాఫలకం ధ్వంసం చేసినందున బొలిశెట్టి, అతని ఇద్దరు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.  ఎస్.రాయవరం సెంటర్లో 21.9.2019న అనకాపల్లి ఎం.పీ గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను అర్ధరాత్రి బొలిశెట్టి ధ్వంసం చేసిన ఘటనపై నమోదైన కేసులో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి. ఇసుక మాఫియా లీడరైన బొలిశెట్టి గోవిందరావు తన కొబ్బరి కాయల షెడ్డులో 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచడంపై అప్పట్లో కేసును నమోదు చేశారు. దాని ఆధారాలు మీడియాకి ప్రజలకి తెలియజేయాలి.  బొలిశెట్టి గోవిందరావు ఇతని భార్య శారదా కుమారి అక్రమాస్తులపై రాష్ట్ర జస్టిస్ లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా 938/2019/LOK/B2/828/2019 సంఖ్యతో 30.10.2019న నమోదైన కేసు ప్రస్తుతం కొనసాగుతుంది.  నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లులో 20 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమిని కొనడం, బొలిశెట్టి అక్రమ ఆస్తుల అంశంపై ఫిర్యాదులు చేయగా రాష్ట్ర ప్రభుత్వ సిట్ విభాగం 378, 379 నెంబర్లతో 7.11.2019 న బొలిశెట్టిపై కేసు నమోదైంది. ఇదే విషయాలపై ముఖ్యమంత్రి కార్యాలయంలో 158,159 నెంబర్లతో ఎస్.రాయవరం సమాచార హక్కు చట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు స్వయంగా ఆధారాలతో సహా 4.11.2019 న ఫిర్యాదు చేయగా అతనిపై కక్షతో బొలిశెట్టి గోవిందరావు, తన ఇసుక మాఫియా అనుచరులతో 30.5.2020న హత్యా యత్నం చేయించారని, ఈ దాడి మొత్తం సి.సి కెమెరాల్లో రికార్డు అయ్యిందని దానిపై కూడా విచారణ చేపట్టాలి. అక్రమాలకు పాల్పడిన ఎస్.రాయవరం మాజీ ఎంపీటిసి-2 బొలిశెట్టి గోవిందరావుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయనపై రౌడీషీటర్ కేసు నమోదు చేయాలని, ఆయన వందలాది ఎకరాల అక్రమ భూములు, అక్రమాస్థులు, బినామీ ఆస్తులపై విచారణ చేయాలని, అక్రమ ఆస్తుల ఆర్జన రుజువైతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విశాఖ జిల్లా దళిత సంఘాల సమాఖ్య వేదిక కన్వీనర్ డా. బూసి వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.