రహదారి భద్రత కోసం విద్యార్ధులు తెలుసుకోవాలి..
Ens Balu
4
Mandapam
2022-03-05 17:55:39
రహదారి భద్రత కోసం పాఠశాల దశ నుంచే అన్నీ విద్యార్ధులు తెలుసుకోవాలని అదేవిధంగా మైనర్లు మోటార్ వాహనాలు నడుపుతూ ఏదైనా ప్రమాదానికి గురైతే నష్టపరిహారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించవని, నష్టపరిహారాన్ని తల్లిదండ్రులే భరించాలని సచివాలయ మహిళా పోలీస్ గంగగౌతమి పేర్కొన్నారు. శంఖవరం మండలంలోని మండపం గ్రామంలోని జెడ్పీ హైస్కూలులో విద్యార్థులకు మత్తు పదార్ధాలు, వాటి వలన కలిగే అనర్ధాలపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా "చేతన" కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. 18ఏళ్లు నిండ కుండా, లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు, కార్లు నడప రాదని అదేవిధంగా ద్విచక్ర వాహనం పై ముగ్గురు ప్రయాణించడం నేరమని గుర్తుంచుకోవాలన్నారు. రోడ్డు నిబంధనలు అతిక్రమించే వారికి మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీగా పెనాల్టీలు విధిస్తున్న సంగతి విద్యార్ధులు గమనించాలన్నారు. అదేవిధంగా ప్రతి మహిళ తప్పనిసరిగా దిశ యాప్ ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆపదలో ఉన్న మహిళలు దిశ యాప్ ఉపయోగించడం ద్వారా రక్షణ పొందుతారని అన్నారు. చరవాణిలో దిశ యాప్ ఉంటే మీ చెంత రక్షకభటులు ఉన్నట్లేనని మహిళా పోలీస్ గంగ గౌతమి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.