గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై విద్యార్ధినిలకు చైతన్యం..
Ens Balu
3
Velangi
2022-03-05 17:57:05
బయటి వ్యక్తులు చనువు తీసుకొని మాట్లాడే సమయంలో నిర్జన ప్రదేశాల్లో తాకకుండా విద్యార్ధినిలు జాగ్రత్తలు పాటించాలని వేలంగి గ్రామసచివాలయ మహిళా పోలీస్ నాగమణి విద్యార్ధినిలకు సూచించారు. శనివారం శంఖవరం మండలంలోని వేలంగి ఎంపీపీ స్కూలులో విద్యార్ధినిలకు గుడ్ టచ్ లపై విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న చేతన కార్యక్రమంలో భాగంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అనే అంశంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ నాగమణి మాట్లాడుతూ, స్కూలు విద్యార్ధినిలు తెలియని వ్యక్తులతో మాట్లాడే సమయంలో వారికి దూరంగా నిలబడాలన్నారు. అంతేకాకుండా ఎవరైనా చేయి వేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తే వ్యతిరేకించాలని, చేయి వేయకుండా మాట్లాడాలని దైర్యంగా సమాధానం చెప్పాలని విద్యార్ధినిలకు సూచించారు. విద్యార్ధినిలకు అర్ధమయ్యేలా ఏఏ ప్రద్యేశాల్లో తాకితో గుడ్ ట్ అవుతుంది. ఏఏ ప్రదేశాల్లో తాకితే బ్యాడ్ టచ్ అవుతుందో చక్కగా చైతన్యం కల్పించారు. అనంతరం సైబర్ క్రైమ్, రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో హెచ్ఎం ప్రియాంక, ఏఎన్ఎం బి.సుబ్బలక్ష్మి, ఆశా కార్యకర్త అనురాధ వార్డు సభ్యులు పాల్గొన్నారు.