మత్తు పదార్ధాల వలన వచ్చే అనర్ధాలు తెలుసుకోవాలి..


Ens Balu
3
Sankhavaram
2022-03-05 17:58:58

పాఠశాల దశ నుంచే విద్యార్ధినిలు మత్తుపదార్ధాల వలన జరిగే అనర్ధాలపై అవగాహన పెంచుకోవాలని, ఆపై వాటికి దూరంగా ఉండాలని గ్రామ సచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పిలుపు నిచ్చారు. శంఖవరం మండల కేంద్రంలో లిటిల్ రోజెస్ ఇంగ్లీషు మీడియం స్కూలులో విద్యార్థులకు మత్తు పదార్ధాలు, వాటి వలన కలిగే అనర్ధాలపై  తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా "చేతన" కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష మాట్లాడుతూ, పాఠశాల దశ నుంచే విద్యార్ధులకు అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం గుడ్ టచ్ బ్యాడ్ టచ్, రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, చైల్డ్ సేఫ్టీ తదితర అంశాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూలు హెచ్ సయ్యద్ నూర్జహాన్,  ఉపాధ్యాయిని సత్యకుమారి, అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.

సిఫార్సు