మధుమేహంతో జాగ్రత్తలు వహించాలి..
Ens Balu
5
Kakinada
2022-03-10 11:04:40
గర్భిణీ స్త్రీలలో మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉందని అయితే డెలివరీ అనంతరం రక్తంలో షుగర్ స్థాయి తగ్గి నార్మల్ గా వస్తుందని అయితే కొందరిలో మాత్రం కొనసాగే అవకాశం ఉందని ప్రాణిక్ హీలింగ్ వైద్యురాలు యం. వరలక్ష్మి పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేట అంగన్వాడి కేంద్రంలో బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో గర్భిణీ లలో మధుమేహం నివారణ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన సదస్సు జరిగింది. వరలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీలలో మధుమేహాన్ని నివారించడానికి, నియంత్రించడానికి ప్రతి ఏటా మార్చి 10న గర్భిణీలలో షుగర్ వ్యాధి పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక బరువు, మానసిక ఒత్తిడి, వంశపారంపర్యంగా గర్భిణీలలో షుగర్ వ్యాధి ఆరో నెల లో బయటపడుతుందని అన్నారు. గర్భిణీ సమయంలో వచ్చే షుగర్ వ్యాధి వలన పుట్టినప్పుడు శిశువు బరువుగా ఉండటం, నెలలు నెలలు నిండకముందే ప్రసవించడం, ఒకో సారి గర్భంలోనే శిశువు చనిపోయే అవకాశం ఉందన్నారు. గర్భిణీ సమయంలో షుగర్ వ్యాధి వస్తే పోషకాహార నిపుణులను సంప్రదించి ,ఆహార నియమాలు పాటించాలని వరలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాఘవరావు, పద్మావతి పాల్గొన్నారు.