ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే..
Ens Balu
2
Kakinada
2022-03-10 11:06:46
మూఢాచారాలు, అసమానతలు, దౌర్జన్యాలను ఎదిరించిన వీర వనిత సావిత్రిబాయి పూలే అని నేటితరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని ఆధ్యాత్మికవేత్త పి.వి రాజేశ్వరి పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి ఘనంగా జరిగింది. రాజేశ్వరి మాట్లాడుతూ పురుషులతో సమాన హక్కులు, హోదా, గౌరవం కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని అన్నారు. వాకర్స్ జిల్లా చైర్పర్సన్ అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, సతీసహగమనం ,భ్రూణ హత్యలు వంటి వాటిని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసిన స్త్రీ విముక్తి ప్రదాత సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఆమె 1897 మార్చి 10న కాలం చేశారని అడబాల తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.