అపాయం ఎదురైనపుడు సునాయసంగా ఎదుర్కోడానికి ఆత్మరక్షణ నిచ్చే విద్య కరాటే అని ఈ మార్షల్ ఆర్ట్స్ తో మనోధైర్యం ఇనుమడిస్తుందని రాష్ట్ర టెన్నికాయిట్ సంఘ అధ్యక్షులు వై డి రామారావు పేర్కొన్నారు. కాకినాడలోని బోట్ క్లబ్ ఉద్యానవనంలో పరిమల కరాటే క్లబ్ ద్వారా కరాటే పోటీలలో విజేతలైన బాలబాలికలకు రామారావు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటే శిక్షణ వలన రక్షణ తో పాటు శారీరక వ్యాయామం కూడా చేకూరుతుందని అన్నారు. కరాటే కోచ్ డి .సతీష్ మాట్లాడుతూ ఇటీవల కాకినాడ స్పోర్ట్స్ గ్రౌండ్లో జరిగిన జిల్లాస్థాయి కరాటే పోటీలలో తమ సంస్థ తరఫున 15 మంది బాల బాలికలు పాల్గొనగా ముగ్గురికి స్వర్ణ, ముగ్గురికి రజిత ,నలుగురికి కాంస్య పతకాలు లభించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బోట్ క్లబ్ వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్, కార్యదర్శి దాసరి శ్రీధర్, రేలంగి బాపిరాజు ,చింతపల్లి సుబ్బారావు ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.