నీటి తీరువా నోటీసులతో రైతులను భయపెడుతున్న ప్రభుత్వం..బీజేపీ
Ens Balu
3
Prathipadu
2022-03-19 10:52:41
నీటి తీరువా పన్నుల వసూళ్ళలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం వహించి, ఖజానాకు నిధులు అవసరమైనప్పుడు, పాత బకాయిలన్నీ వడ్డీతో సహా కట్టమని రైతులకు నోటీసులు పంపడం ప్రభుత్వాలకు సరికాదని బిజెపి స్వచ్చబారత్ అభియాన్ విభాగం రాష్ట్ర కన్వీనర్ పాలూరి సత్యానందం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కత్తిపూడిలో మీడియాతో మాట్లాడారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణా లోపం వల్ల, రైతులకు కావలసినంత నీరు అందించలేకపోతున్నారని, శివారు భూములకు నీరు సరిగా అంధక ఏళ్ల తరబడి రైతులు పంట నష్టపోతున్నారని, కానీ పాతబకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించమనడం భావ్యం కాదని అన్నారు. ఖరీఫ్ పంటకు రూ 200/-, రబీ పంటకు రూ. 150/- చొప్పున, సంవత్సరానికి ఎకరానికి రూ. 350/- చొప్పున, పాతబకాయిలన్నీ వడ్డీతో సహా కట్టమని నోటీసులు పంపుతున్నారని, కరోనా కారణంగా రైతులందరూ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడ్డారని, తుఫానులు, భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయారని, ఇప్పటి వరకు ఉన్న నీటి తీరువా బకాయిలను పూర్తిగా రద్దు చేయాలని బిజెపి పార్టీ డిమాండ్ చేస్తున్నామన్నారు.