దిశయాప్ అత్యధిక రిజిస్ట్రేషన్లలో ఆముగ్గురు


Ens Balu
8
Sankhavaram
2022-03-25 04:52:45

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్  అన్నవరం స్టేషన్ పరిధిలో దిశయాప్ ను అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయించడంలో శంఖవరం మండలంలోని గ్రామ సచివాలయ మహిళా పోలీసులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇందులో మొదటి స్థానంలో శంఖవరం మండల కేంద్రంలోని శంఖవరం-1 గ్రామసచివాలయ మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష నిలవగా, మండపం గ్రామసచివాలయ మహిళా పోలీస్ గంగగౌతమికి ద్వితీయ స్థానం, నెల్లిపూడి గ్రామసచివాలయ మహిళా పోలీస్ కళాంజని త్రుతీయ స్థానాల్లో నిలచారు. సర్కిల్ పరిధిలో ఒకే మండలం నుంచి ముగ్గురు గ్రామ సచివాలయ మహిళా పోలీసులు మూడు స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఈ ముగ్గురిని జిల్లా అడిషనల్ ఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు మెమెంటోలతో ఘనంగా సత్కరించారు.  వారి సచివాలయాల్లో కూడా సహచర సిబ్బంది అభినందించారు. దిశ యాప్ రిజిస్ట్రేష్లన్లో రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లా ప్రధమ స్థానంలో నిలవగా ప్రస్తుతం ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలోని గ్రామసచివాలయ మహిళా పోలీసులందరూ యాప్ రిజిస్ట్రేషన్లు చేయించడంలో ప్రత్యేక శ్రద్ధను కనపరడచం పై సర్కిల్ ఇనెస్పెక్టర్ కిషోర్ బాబు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తితో మిగిలిన గ్రామ సచివాలయ మహిళా పోలీసులందరూ దిశ యాప్ రిజిస్ట్రేషన్లు అధికంగా చేయించి యాప్ ను అన్ని వర్గాల ప్రజలకు చేరువ అయ్యేలా చూడాలని కోరారు.
సిఫార్సు