బియ్యం పంపిణీ పొడిగింపుపై హర్షం..
Ens Balu
3
Prathipadu
2022-03-27 07:08:30
భారతదేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యం పంపిణీ విధానాన్ని మరో 6 నెలలు పొడిగించడం పట్ల స్వచ్చభారత్ రాష్ర్ట కన్వీనర్ పాలూరి సత్యానందం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఆయన మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం కరోనా మొదటి దశలో కేంద్రం ప్రారంభించిందని..అయితే ప్రస్తుత పరిస్థితిని ద్రుష్టిలో పెట్టుకొని 2022 సెప్టెంబర్ వరకూ పొడిగించడం శుభపరిణామమని పాలూరి ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయమై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ప్రకటన చేయడం హర్షనీయమని తెలియజేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద గుర్తించిన 81 కోట్ల రేషన్ కార్డుదారులకు ఈ పథకం ఊరటనిస్తుందని పాలూరి మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.