సమగ్ర భూసర్వేతో ప్రతీ ఇంచీ కొలతల్లోకి వస్తుంది..
Ens Balu
5
Kakinada
2022-03-28 10:31:00
జగనన్న సమగ్ర భూ సర్వేను అందరు వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ తహసీల్దార్ మురార్జీ సూచించారు. కాకినాడ రమణయ్యపేటలో ఈ మేరకు సమగ్ర భూ సర్వే కార్యక్రమమాన్ని తహశీల్దార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అదునాతన కంప్యూటర్ ర్లు, డ్రోన్లు, శాటిలైట్ ద్వారా ప్రతి ఇంచు రేఖాంశాన్ని కూడా కొలిచి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ లో నిక్షిప్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆదేశానుసారం కాకినాడ రూరల్ మండలం ముఖ్య ప్రదేశాల్లో ఈ సమగ్ర భూసర్వే కార్యక్రమం తొలుత నిర్వహించి తరువాత మొత్తం ప్రాంతాలను సర్వే చేయనున్నట్టు తెలియజేశారు. ఈ సర్వే లోసెంట్రల్ గవర్నమెంట్ అఫ్ ఇండియా సర్వయర్ పి. చిన్న కొండయ్య, మండల సర్వేయర్ గోపాలచార్యులు, వైస్సార్సీపీ నాయుకులు సత్తిబాబు,కృష్ణంరాజు, రమణ, రేఖారెడ్డి,భాస్కర్, ధర్మరావు, వీఆర్వో నున్న సత్యనారాయణ, నాగేంద్ర,కిరణ్, తాతారావు,భవాని,తదితరులు పాల్గొన్నారు.