ముంపు బాధితుల సమస్యలకు పరిష్కారం..
Ens Balu
3
Rampachodavaram
2022-04-07 13:13:37
పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. గురువారం స్థానిక ఐటిడిఎలో ప్రవీణ్ ఆదిత్య, రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, సంబంధిత ఇంజనీర్లు, ఆర్ అండ్ ఆర్ అధికారులు, తహసిల్దార్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్ కాలనీలలో మౌలిక సదుపాయాలు పక్కాగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. అర్హులైన వారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదే విధంగా కొంతమంది 18 సంవత్సరాల ప్యాకేజీ, మరికొంత మంది ఇళ్లకు సంబంధించిన ప్యాకేజీ, భూమికి భూమి సమస్యలు కొంతమంది, త్రాగునీరు కొరకు సమస్యలు తదితరవి మా దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్ని సమస్యలు పరిష్కరించి మంజూరు అమలు చేయుటకు నిబంధనల ప్రకారం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కొండమొదలు పంచాయతీలోని కొంతమంది ముంపు బాధితుల సమస్యలు కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలవరం ముంపు బాధితులకు సంబంధించిన వివిధ రకాల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతుందని ఎ ఆర్ అండర్ కాలనీలోనేనా బిల్డింగుల లీకేజీలు ఉంటే అదేవిధంగా మరుగుదొడ్ల లో లీకేజీలు ఉంటే త్వరితగతిన మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ లు డేవిడ్ రాజు, నాగేశ్వరరావు, తహసీల్దార్లు వీర్రాజు, శ్రీమన్నారాయణ, డీఈ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.