ఎండలో తిరిగి వడదెబ్బ బారిన పడొద్దు..
Ens Balu
3
సర్పవరం
2022-04-08 08:18:55
రోజురోజుకీ ఎండలు పెరగడంతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని సాధ్యమైనంత వరకూ ఎండలో తిరగ రాదని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాటన్ దుస్తులు ధరించాలని, మంచి నీటిని కూడా తీసుకువెళ్ళి దాహం వేసినప్పుడు తాగాలి అని అన్నారు. మసాలా పదార్థాలతో తయారైన ఆహారపదార్థాలను తీసుకోరాదని డాక్టర్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,రాఘవ రావు తదితరులు పాల్గొన్నారు.