కాకినాడ వాసులకు సురక్షిత మంచినీరు


Ens Balu
3
Kakinada
2022-04-08 08:52:23

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా సురక్షితమైన నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 11,12, 34 డివిజన్లలో వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మంచినీటి సరఫరాలో ఇబ్బందులు,సమస్యలను స్వయంగా పరిశీలించారు.  నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న మంచినీటిని స్వయంగా త్రాగి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
 మంచి నీటి నాణ్యత పై ఎటువంటి  అపోహలు అవసరం లేదని భరోసా ఇచ్చారు.   కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మంచినీటిని  వాహనాల శుభ్రం చేయడానికి, బట్టలు ఉతకడానికి, రోడ్లు కడగడానికి వినియోగిస్తున్న విషయాన్ని గుర్తించారు. త్రాగడానికి వినియోగించే మంచినీటిని అలా దుర్వినియోగం చేయడం  సరికాదని  సూచించారు.వేసవి దృష్ట్యా నీటిని పొదుపుగా వాడాల్సిన  ఆవశ్యకత ఉందని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్ర స్థాయిలో   రోజువారీ నీటి సరఫరా జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి క్లోరిన్ శాతాన్ని సరిచేసి సరఫరా లో అవాంతరాలు లేకుండా పరిష్కరించాలని, ఎక్కడైనా  సమస్యలు ఉంటే  వెనువెంటనే పై అధికారులుకు దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని ఆదేశించారు.  ఎక్కడైనా త్రాగు నీరు అందని పక్షంలో నీరు ట్యాంకర్లు ద్వారా పంపిణీ చేసి అందరికి మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈ  పి.సత్యకుమారి ఆదేశించారు.  ఈ పర్యటన లో ఇంచార్జి కమిషనర్  వెంట డి ఈ  ప్రభాకరరావు  అమీనీటిస్ సెక్రెటరీ ఉన్నారు.
సిఫార్సు