సీఎం వైఎస్ జగన్ కూడా ఒక వాలంటీర్..
Ens Balu
3
Amadalavalasa
2022-04-19 11:51:29
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక వాలంటీర్, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక వాలం టీర్ ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో ప్రజల కోసం పని చేస్తున్న మేమంతా వాలంటీర్లమని ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. పొందూరు మండలం ఉత్తమ సేవలందించిన వాలంటీర్ లకు పురస్కార సత్కార సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని పురస్కార ప్రదానం చేశారు. ఈ సందర్భముగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ పాలన ప్రజలకు అందుబాటులో లేదని వాలంటీర్, సచివాలయ వ్యవస్థను నెలకోల్పోరని ఆయన అన్నారు. వాలంటీర్లను విమర్శించిన నాయకులు కరోనా కాలంలో జూమ్ మీటింగ్ లో కనిపించెవారిని విమర్శించారు. పొందూరు మండలం పరిధిలోని అచ్చిపోలు, దల్ల, ధర్మపురం, గోకర్ణ పల్లి, గోరింట, కనిమెట్ట, కింతలి, కోటిపల్లి సచివాలయ పరిధిలోని వాలంటీర్లకు సేవమిత్ర, సేవ రత్న, సేవవజ్ర పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు , జడ్పీటీసీ లోలుగు కాంతారావు, మండల టౌన్ పార్టీ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, గాడు నాగరాజు, వైఎస్ఆర్సిపి సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.