అగ్ని ప్రమాదాలపై అవగాహన ముఖ్యం..
Ens Balu
3
Ramanayyapeta
2022-04-19 13:02:10
వేసవి కాలం వచ్చిందంటే అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నందున వాటి నివారణపై అవగా హన ముఖ్యమని అగ్నిమాపక శాఖ అధికారి బి. ఏసుబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని రమణయ్యపేట ఏపిఐఐసి కాలనీ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మామూలు సీజన్లో కన్నా వేసవిలోనే అగ్ని ప్రమాదాలు అధిక మన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు గాను ఈనెల 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ సిలిండర్ వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వాకర్స్ జిల్లా చైర్పర్సన్ అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల వలన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ప్రాణాలను సైతం లెక్కచేయక అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయో వాటిని ఏ విధంగా నివారించాలో అగ్నిమాపక సిబ్బంది ప్రాక్టికల్ గా వివరించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడబాల ఆధ్వర్యంలో ఏసుబాబు ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రేలంగి బాపిరాజు, పార్థసారథి, మల్లీశ్వరి, పట్నాయక్ ,రాఘవరావు, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.