ఫ్యాన్లు బహుకరించిన అడబాల ట్రస్ట్


Ens Balu
3
Ramanayyapeta
2022-04-19 13:03:57

కాకినాడలోని రమణయ్యపేట గైగోలుపాడు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల సౌలభ్యం  కోసం అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విఆర్వో తాతారావు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు జరుగుతున్నందున వారి సౌలభ్యం కోసం సీలింగ్ ఫ్యాన్లు సమకూర్చిన అడబాల ట్రస్ట్ నిర్వాహకులు అడబాల రత్న ప్రసాద్ సేవాతత్పరత అభినందనీయమన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ .రవి మాట్లాడుతూ మాజీ సర్పంచ్ గా అడబాల రత్న ప్రసాద్ పాఠశాలలో లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని  అన్నారు.   ఇటీవల 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు అందజేశారని ఆ సమయంలో సీలింగ్ ఫ్యాన్ లు కావాలని అడిగిన వెంటనే సమకూర్చారని అన్నారు .ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జి. లోవబాబు, పట్నాయక్, రేలింగి బాపిరాజు,  ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు .
సిఫార్సు