భూముల రీసర్వేలో పురోగతి నమోదుకావాలి..


Ens Balu
4
Anaparthi
2022-04-19 14:56:00

భూముల రీ సర్వే పనుల్లో పురోగతి సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అనపర్తి మండలంలో రీసర్వే పనులను తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన రీ సర్వే డేటా ఎంట్రీ నమోదు ను పరిశీలించారు. క్షేత్రస్థాయి లో సేకరించిన డేటా వివరాలు నమోదు విషయం లో అత్యంత జాగ్రత్త వహించాలన్నారు. భూములు సర్వే నవీన కరణలో డేటా నమోదు కీలకం అయినందున  మండల అధికారులు సిబ్బంది పై పూర్తి భాద్యత ఉంచి నిర్లక్ష్యం గా వ్యవహరించారాదని పేర్కొన్నారు. పురోగతిని నమోదు చేస్తూ.. రీ సర్వే వేగవంతం చేసి ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలని అధికారులను ఆదేశించారు.  ఈ తనిఖీ లో మండల స్థాయి అధికారులు, తదితరులు ఉన్నారు.
సిఫార్సు