చదువుల్లో మరింతగా రాణించాలి


Ens Balu
3
Narsipatnam
2022-04-21 14:34:59

చదువులో రాణించినా నాడే అంబేద్కర్ ఆశయాలు సాధించినవారువుతారు అని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. గురువారం నర్సీపట్నం లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల కళాశాలలో పదో తరగతి, ఇంటర్ చదువుతున్న వారికి వీడ్కోలు సభ జరిగింది. వీరందరికీ ఎమ్మెల్యే పరీక్ష రాసుకునేందుకు సుమారు 300 అట్టలు, పెన్నులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల గ్రామాల నుంచి చాలా దూరం నుంచి వచ్చి చదువుతున్న మీరంతా బాగా చదివి అంబేద్కర్ ఆశయాలను సాధించాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాను అన్నారు. కార్పొరేటు కళాశాలలను తలదన్నే విధంగా ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురుకుల కళాశాలలను మెరుగు పరుస్తుందని అన్నారు.దీంతోపాటు హెచ్ సి ఎల్  లో ఉద్యోగాలు పొందిన 15 మందికి మెమెంటో లను అందజేసి వారిని సన్మానం చేశారు. అదేవిధంగా కళాశాలలో ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న క్లాస్ కి మొదటి మరియు రెండవ ర్యాంకు సాధిస్తున్న విద్యార్థినిలకు ప్రత్యేకంగా మెమెంటో లను అందజేసి వారిని ఉత్సాహపరిచారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రశారద ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఇప్పటికే తమ కళాశాలలో చదువుకున్న వారు ఉన్నత స్థానాలకు, ఉన్నత చదువులకు వెళ్లారని చంద్రశారధ తెలిపారు. బాలికలు సాంస్కృతిక నృత్య రూపక కార్యక్రమాలలో కళాశాలను అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను ఘనంగా పాఠశాల సిబ్బంది ప్రిన్సిపాల్ సత్కరించారు పాఠశాలలో మరిన్ని వసతులను సమకూరుస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ తో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు