జగనన్న ఇళ్ల నిర్మాణాలు వేగం పెంచాలి


Ens Balu
2
Makavarapalem
2022-04-21 16:29:26

జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మాకవరపాలెం మండలం తామరం, మాకవరపాలెం, భీమబోయిన పాలెం గ్రామాలలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.  ప్రణాళిక ప్రకారం ఇనుము, సిమెంటు, ఇసుక ఇటుక సరఫరా చేయాలని,  నిర్మాణాలు తొందరగా పూర్తి చేయించాలి అన్నారు. నిర్ణీత సమయంలో అన్ని గృహాలు పూర్తవ్వాలన్నారు.  కాలనీల్లో పనులను పరిశీలిస్తూ లబ్ధిదారులతో మాట్లాడారు.  వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  వారంతా ఎంతో సంతోషంతో తమకు సొంత ఇల్లు ఏర్పడుతున్నందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఏమైనా ఆటంకాలు వచ్చినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని దీనిపై తక్షణం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ పర్యటనలో నర్సీపట్నం ఆర్డీవో ఆర్ గోవిందరావు, ఎంపీడీవో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు