సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు పక్కాగా..
Ens Balu
2
Sabbavaram
2022-04-23 13:49:38
సీఎం వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. శనివారం సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం గ్రామంలో, ఈ నెల 28 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున, అనకాపల్లి జిల్లా కలెక్టర్ పఠాన్ శెట్టి రవి శభాష్, డిఐజి ఎస్. హరికృష్ణ, పెందుర్తి శాసన సభ్యులు అదీప్ రాజ్ లతో కలిసి ఆయన పరిశీలించారు. ముఖ్య మంత్రి పర్యటనకు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున వివరించారు. పైలాన్, స్టాల్స్, మోడల్ హౌస్, పార్కు లను ముఖ్యమంత్రి సందర్శిస్తారని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ సమావేశానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సైనేజస్ బోర్డులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతీ పేద వారికి అన్ని సౌకర్యాలుతో కూడిన గృహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. వచ్చిన దరఖాస్తులలో తిరస్కరణకు గురైన దరఖాస్తుల తిరిగి సాధ్య సాధ్యాలను పరిశీలించి వారికి అర్హత గల ప్రతీ పేద వారికి లబ్ధి చేకూరాలన్నారు. ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. అనంతరం పైలాన్, మోడల్ హౌస్, సభా స్థలాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.