మీరు మనుషులుకాదు మానవత్వమే లేదు


Ens Balu
2
Anantapur
2022-04-23 14:10:01

మీకు అసలు మానవత్వం అనేది లేనట్టుంది. చిన్నపిల్ల అందునా 3ఏళ్ల చిన్నారిని ఎలా హింసిస్తారని అంగన్వాడీ సిబ్బందిపై అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని కోవుర్ నగర్ లో మూడేళ్ల బాలుడు ఈశ్వర్ కృష్ణా ను అంగన్వాడీ సిబ్బంది కొట్టి గాయపరిచారు.విషయం తెలుసుకున్న మేయర్ వసీం శనివారం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి బాధిత చిన్నారి తల్లితండ్రుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీకు పిల్లలు ఉన్నారు కదా మీ పిల్లల్ని ఇలానే హింసిస్తారా అని ప్రశ్నించారు. బాద్యులపై చర్యలు తీసుకోని భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఐ సి డి ఎస్ సీడీపీఓ లాలితమ్మ కు మేయర్ వసీం సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనీల్ కుమార్ రెడ్డి, నాయకులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.


సిఫార్సు