గ్రామపాలనకు పునాది పంచాయతీరాజ్ వ్యవస్థ
Ens Balu
2
సర్పవరం
2022-04-24 07:07:26
అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యానికి కొలబద్ద పంచాయతీరాజ్ సంస్థలు అని అనకాపల్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గింజాల గంగరాజు పేర్కొన్నారు. ఆదివావారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ మండల న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు ,మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకొని జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధికి, సామాజిక న్యాయ సాధనకు అవసరమైన వార్షిక ప్రణాళికలను ఒక యజ్ఞం లాగ పంచాయతీరాజ్ సంస్థలు రూపొందించి అమలు చేయాలనే లక్ష్యంతో 73, 74 రాజ్యాంగ సవరణలు 1993 ఏప్రిల్ 24 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రావడంతో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చక్కటి ప్రణాళికలు రూపొందించినప్పుడే పంచాయతీ రాజ్ వ్యవస్థ పరిపూర్ణమై మరింత పటిష్టవంతం అవుతుందని అన్నారు. వేగవంతమైన అభివృద్ధి, సమగ్రమైన, సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి వికేంద్రీకరణ, సూక్ష్మ స్థాయి ప్రణాళికలు కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో న్యాయవాది యనమల రామo, రాజా ,రాఘవరావు, రేలింగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.