చెరువులతో భూగర్భజాలలు అభివ్రుద్ధి
Ens Balu
5
Chodavaram
2022-04-24 09:05:04
చెరువులను అభివృద్ధి చేస్తే భూగర్భజలాలు సమృద్ధిగా లభిస్తాయని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ చెప్పారు. ఆదివారం చోడవరం మండలం రాయపు రాజుపేట శివారు నరసాపురం గ్రామం లో చెరువు అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ ఉత్సవంలో భాగంగా ప్రకృతి వనరులను పటిష్ట పరిచేందుకు జాతీయ ఉపాధి హామీ పథకంలో చెరువులలో మట్టి పూడికతీత పనులు చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ తవ్వకాలు మూలంగా ఎక్కువ నీరు నిల్వ ఉంటుందని దానివలన చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ప్రకృతి ప్రసాదించిన వనరులను ముఖ్యంగా నీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఉపాధిహామీ కూలీల తో మాట్లాడుతూ వేతనాలు సకాలంలో వస్తున్నాయా లేదా, సచివాలయ సేవలు రేషన్ సరఫరా ఎలా ఉన్నాయి అని ఆరా తీశారు. తమకు అన్ని సకాలంలో వస్తున్నాయని ఇంటి వద్దకే రేషన్ తీసుకొస్తున్నారని కూలీలు చెప్పారు. మండలంలోని వెంకన్నపాలెం, గజపతినగరం గ్రామాలలో జగనన్న కాలనీలు లేఅవుట్లు కలెక్టర్ పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి అవ్వాలని, అవసరమైన చోట్ల బోర్లు వేయాలని, విద్యుత్ సరఫరా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గృహాలకు దగ్గరగా ఉన్న విద్యుత్ స్తంభాలను కొంత దూరంలో వేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్డీవో చిన్నికృష్ణ తాసిల్దార్ తిరుమల బాబు ఎంపీడీవో శ్యామ్ సుందర్ ఆర్డబ్ల్యూఎస్ డీఈ శివ ప్రసాద్ గృహ నిర్మాణ, డ్వామా అధికారులు పాల్గొన్నారు.