కోట సత్తెమ్మతల్లికి జిల్లా కలెక్టర్ పూజలు


Ens Balu
3
Nidadavole
2022-04-25 08:59:46

నిడదవోలు కోట సత్తెమ్మ తల్లిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత దర్శించు కొని ప్రత్యేక పూజలు చేశారు.  సోమవారం నిడదవోలు నియోజవర్గం పరిధిలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో పాల్గొనడానికి నిడదవోలు విచ్చేసిన జిల్లా కలెక్టర్ కి స్థానిక శాసన సభ్యులు జీ. శ్రీనివాస నాయుడు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు.  ఈ  సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి,  వేదపండితులు పూర్ణకుంభంతో  స్వాగతం పలుకగా తదుపరి శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి కలెక్టర్ డా. కె.మాధవిలత దర్శనం చేసుకున్నారు. ఆలయ ఈవో. బల్లా నీలకంఠం స్వాగతం పలుకగా , ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసారు. అమ్మవారిని దర్శించుకున్న  కలెక్టరు జిల్లాప్రజలు తరపున అభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ వెంట స్థానిక శాసన సభ్యులు జి.శ్రీనివాసనాయుడు, జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్, ఆలయ చైర్మన్  దేవులపల్లి రామసుబ్బరాయశాస్త్రి, ఎఎంసి చైర్మన్ పొలయ్య, మున్సిపల్ కమిషనర్ పద్మావతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితులున్నారు.
సిఫార్సు