బాల్య వివాహాలు చేస్తే శిక్ష తప్పదు..
Ens Balu
4
Sarpavaram
2022-04-26 07:43:21
పరిపక్వత లేని వయసులో బాలికలకు వివాహం తలపెడితే పెండ్లి కుమారుడు తో పాటు వధూవరుల తల్లిదండ్రులు, ఫోటోగ్రాఫర్, పురోహితుడు, బంధువులు ఇలా అందరిపై కేసులు నమోదు అవుతాయి అని న్యాయవాది యనమల రామం పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మంచి చెడు తెలియక కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసి బాధ్యత వదిలించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఆడ పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పలేక పెళ్లిళ్లకు ఒప్పుకుంటున్నారని అన్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేయడంతో శారీరక పరిపక్వత సాధించక ముందే తల్లులు అవుతున్నారని అన్నారు. దీంతో బిడ్డ ఎదుగుదలలో కూడా లోపం వచ్చే అవకాశం ఉందన్నారు. బాల్య వివాహం జరిగితే 1098, 100 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని యనమల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,పట్నాయక్, ఓం నమశ్శివాయ, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.