సూర్యభగవానుడి కళ్యాణంలో స్పీకర్
Ens Balu
27
Arasavilli
2022-04-26 10:22:18
కలియుగ ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ దంపతులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం మంగళవారం జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమానికి శాసనసభాపతి దంపతులతో హాజరయ్యారు. తొలుత ఆలయ కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్యప్రకాశ్ శాసనసభాపతికి ఆలయ మర్యాదలతో పూలమాలను వేసి స్వాగతం పలుకగా, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ వేదమంత్రాలు, పూర్ణకుంభంతో దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి తీర్ధ ప్రసాదాలను దంపతులకు అందజేసారు. ఈ సందర్భంగా స్వామి వారి అన్నదాన కార్యక్రమానికి శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ రూ.25వేల నగదును ఆలయ కార్యనిర్వహణాధికారికి అందజేసారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, మండల మన్మధరావు, యామిజాల గాయత్రి, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.