లబ్దిదారులతో ఫోటో దిగిన సిఎం జగన్..
Ens Balu
3
Anakapalle
2022-04-28 11:52:00
అనకాపల్లి జిల్లాలోని పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 20 మంది గృహ లబ్దిదారులతో బృంద ఫోటో దిగారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులను చిరు నవ్వుతో ఆప్యాయంగా పలకరించారు. సమావేశం అనంతరం ఆ బృంద ఫోటోని ఫ్రేమ్ కట్టించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. మంత్రులు బూడి ముత్యాల నాయుడు, అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజనీ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.