సచివాలయ సేవలు ప్రజలకు చేరువచేయాలి


Ens Balu
3
Anaparthi
2022-04-29 12:03:04

గ్రామ స్థాయిలో పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చెయ్యడం, పారదర్శకతతో కూడిన ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యమని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు. శుక్రవారం అనపర్తి లో సచివాలయం-4 , అర్భికే-4 లను జాయింట్ కలెక్టర్  తనిఖీ చేశారు. అనంతరం దుప్పలపూడి లే అవుట్ లో గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే క్రమంలో గ్రామ స్థాయిలో సచివాలయ, ఆర్భికే లను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు.  పౌర సేవలు అందించే క్రమంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  సచివాలయం లోని వివిధ రీజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆర్భికే ను సందర్శించి, ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియపై సిబ్బందిని వివరాలు జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలుసుకున్నారు.  రైతులకు సరైన తూకం వేసి, సరైన ధర అందించేందుకు సిబ్బంది నిబద్దతతో పనిచేయాలన్నారు. రైతు వివరాలు, బ్యాంకు ఖాతా సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డేటా ఎంట్రీ సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఎటువంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జేసీ వెంట మండల స్థాయి అధికారులు, సచివాలయ, అర్భికే సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు