సచివాలయాలనికి వస్తే సంత్రుప్తిగా వెళ్లాలి
Ens Balu
3
Devarapalli
2022-04-29 12:07:37
గ్రామ సచివాలయానికి వచ్చినవారు సంతృప్తిగా తిరిగి వెళ్లేలా పనిచేయడం లేదా సమాచా రం ఇవ్వడం చేయాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన దేవరాపల్లి మండలం లో దేవరాపల్లి పెద్దనందిపల్లి సచివాలయాలను సందర్శిం చారు. ప్రజలకు అందుతున్న సేవలు పరిశీలించారు. రిజిస్టర్ లను తనిఖీ చేశారు. పౌరులకు అందించే సేవల గురించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ రోజూ మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని తగు సమయంలో పరిష్కరించాలన్నారు. పలు ప్రభుత్వ పథకాల అమలులో అర్హత లేనివారికి సౌమ్యంగా చెప్పి పంపించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.