10 పరీక్షలు ప్రశాంతంగా జరపాలి
Ens Balu
2
కె.కోటపాడు
2022-04-29 12:10:51
అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరపాలని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన దేవరాపల్లి, కె.కోటపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, కే కోటపాడు లో అయ్యన్న ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు మొదలైన ఏర్పాట్లు చేయాలని, చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి పాల్గొన్నారు.