గ్రామాల్లో వైద్య శిభిరాలు నిర్వహించాలి


Ens Balu
2
Annavaram
2022-04-30 10:12:13

గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు ఆదేశించారు. అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శనివారం తనిఖీ చేశారు. వైద్య అధికారి, సిబ్బందిని సమీక్షించారు. ఎండల తీవ్రత దృష్ట్యా గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు గమనించాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన అన్నారు. ఎండల తీవ్రత పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. వ్యాప్తి చెందే వ్యాధులు, వ్యాప్తి చెందని వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. బయో మెట్రిక్ లో సిబ్బంది హాజరు విధిగా నమోదు కావాలని ఆయన చెప్పారు. ప్రజలకు మంచి సేవలు అందించడం పరమావధిగా భావించాలని ఆయన పేర్కొన్నారు. పి.హెచ్.సిలలో ప్రసవాలు జరగాలని అందుకు వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులు అండగా ఉంటుందనే నమ్మకం కల్పించాలని ఆయన అన్నారు. మంచి సేవానిరతి కలిగిన శాఖలో పనిచేస్తున్నందుకు గర్వపడాలని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వాక్సిన్ వేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
సిఫార్సు