రణస్థలంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్


Ens Balu
2
Ranastalam
2022-05-05 08:11:08

శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ( సి.హెచ్.సి)లో ఈ నెల 7న ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎన్. అనురాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గత నెల 21న శ్రీకాకుళంలో మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ప్రారంభించిన సంగతి విదితమే. ఈ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించడంతో ప్రతి నియోజక వర్గంలో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వేలాది రోగులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించినట్లు ఆమె చెప్పారు.అందులో భాగంగా మే 7న రణస్థలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వివరించారు. రోగులకు అవసరమైన అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించి, నిపుణులైన వైద్యులచే తగిన మందులు, సలహాలు , సూచనలు ఇవ్వనున్నట్లు ఆమె ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. కావున 7వ తేదీ శనివారం నాడు నిర్వహించే మెగా వైద్య శిబిరానికి వేలాదిగా తరలివచ్చి ఉచిత వైద్య సేవలను పొందాలని ఆమె కోరారు.
సిఫార్సు