జగనన్న కాలనీ లేఅవుట్ పరిశీలన
Ens Balu
4
వెంకట బైరిపురం
2022-05-06 09:20:12
పార్వతీపురం మన్యం జిల్లా వెంకట బైరిపురం జగనన్న కాలనీ లేఅవుట్ ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. కాలనీలో ఇప్పటివరకు మంజూరైన ఇల్లు, గ్రౌండింగ్ అయిన వివరాలను తాసిల్దార్ ను అడిగి తెలుసుకున్నారు. మే 15 నాటికి అన్ని ఇల్లు గ్రౌండింగు కావాలని అధికారులను జిల్లా కలెక్టర్ అదేశించారు. అవసరమగు నిర్మాణ సామగ్రి త్వరిత గతిన లబ్దదారులకు సమకూర్చాలని ఆయన అన్నారు. లే అవుట్ లో ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలో 2,589 ఇల్లు మంజూరు అయ్యాయని, వెంకట భైరిపురం గ్రామంలో 85 ఇళ్లకు 55 ఇల్లు గ్రౌండింగ్ అయ్యాయని తాసిల్దార్ డి.వీరభద్ర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి తదితరులు పాల్గొన్నారు.