తెల్లవాడిపై అల్లూరి పోరాటం దేశానికే ఆదర్శం


Ens Balu
8
Sankhavaram
2022-05-07 07:06:06

భరతమాత దాశ్య శ్రుంఖలాలు తెంచడం కోసం మన్యం వీరుడు, విప్లవాగ్ని అల్లూరి సీతారా మరాజు 27 సంవత్సరాలకే తన ప్రాణాలను త్రుణప్రాయంగా వదిలిపెట్టారని అల్లూరి చరిత్ర పరిశోధకులు, పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) కొనియాడారు. అల్లూరి 89వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా, శంఖవరం మండల కేంద్రంలో నిర్మించిన అల్లూరి విగ్రహానికి ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈఎన్ఎస్ బాలు మాట్లాడుతూ, అల్లూరి మరణించి నేటికి 98 సంవత్సరాలు అవుతుందన్నారు. అల్లూరి బ్రిటీష్ సేనలపై చేసిన తిరుగుబాటు ఉద్యమం ఒక చారిత్రాత్మకమైనదని, అది భారత దేశంతోపాటు ప్రపంచ దేశాలకు నేటికీ దిక్సూచి అని అన్నారు. అప్పటి బ్రిటీష్ కలెక్టర్ రూథర్ ఫర్డ్  కి అల్లూరి సీతారామరాజు ఇదే శంఖవరం గ్రామం నుంచి మిరపకాయ్ టపా వర్తమానం పంపి, దమ్ముంటే తనను నేరుగా వచ్చి కలవాలని, సాయంత్రం వరకూ స్థానిక పాఠశాలలో బస చేస్తానని సవాల్ విసిరారని, అయితే అల్లూరి మిరపకాయ్ టపా యావత్ బ్రిటీషు ప్రభుత్వాన్నే గడ గడ లాడించి అల్లూరిని కలిసే దైర్యం ఆ కలెక్టర్ చేయలేకపోయారని గుర్తుచేశారు. అంతటి దైర్యసాలి అల్లూరి మన్యం పితూరీ ఉద్యమం శంఖరం, అన్నవరం, బెండపూడి గ్రామాల్లో కూడా కొనసాగిందని ఆయన తెలియజేశారు. అల్లూరి మన్య పితూరి విప్లవం దేశానికే ఒక ఆదర్శమని కొనియాడారు. ఉప సర్పంచ్ కుమార్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు క్రుషి చేయాలన్నారు. సచివాలయ కార్యదర్శిలు శ్రీరామచంద్రమూర్తి, శంకరాచార్యులు, సత్య, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష లు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు పోరాటం చేసిన శంఖవరం గ్రామంలో ఆయనకు నివాళులు అర్పించడం గర్వంగా ఉందన్నారు. ఆయన స్పూర్తితో ప్రజలకు ఇతోదికంగా సచివాలయాల ద్వారా మరింతగా సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏబీసి రమణమూర్తి, మూడు సచివాలయాల సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు