YSRCP కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలి
Ens Balu
3
Krishnadevipeta
2022-05-07 13:26:39
అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎంపీటీసీ సభ్యుడు, సీనియర్ నాయకులు చింతల బుల్లిప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయన క్రిష్ణదేవీపేటలో మీడియాతో మాట్లాడారు. గొలుగొండ మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, తన సహచర ఎంపీటీసీలు వారి వారి ప్రదేశాల నుంచి పెద్ద పసంఖ్య కార్యకర్తలను, నాయకులను కార్యక్రమానికి తీసుకురావాలని తెలియజేశారు. పాతూరు, క్రిష్ణదేవీపేట, లింగంపేట ఇలా మండలంలోని అన్ని పంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కార్యాలయానికి మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకొని.. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కాన్వాయ్ తోపాటు కార్లు, బైకులు పెద్ద సంఖ్యలో భారీ వాహన యాత్రగా బయలుదేరి వెళతామని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్త సహకరించాలని బుల్లిప్రసాద్ కోరారు.