వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్, చిటికెల భాస్కరనాయుడుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశాఖలో ఘనంగా సత్కరించారు. విశాఖజిల్లా, గొలుగొండ మండలం క్రిష్ణదేవిపేట గ్రామంలోకి అల్లూరి అడుగుపెట్టిన సమయంలో చిటికెల భాస్కరనాయుడు కుటుంబం ఆశ్రయం కల్పించింది. ఆ విషయాన్ని తెలుసుకున్న కేంద్ర మంత్రి విశాఖకు భాస్కరనాయుడుని రప్పంచి సత్కరించారు. అల్లూరి వంటి మహానుభావుడికి ఆశ్రయం కల్పించి చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. అంతేకాకుండా అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టంచడానికి తప్పకుండా చర్యలు కూడా తీసుకుంటామని కేంద్ర మంత్రి ఆయనకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అల్లూరి సంచరించిన ప్రదేశాలను కేంద్రప్రభుత్వం కూడా ప్రత్యేక టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్డడానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రిని భాస్కరనాయుడు కోరడంతో దానికి కూడా ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ పురం ఎంపీటీసీ సభ్యుడు చింత బుల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.