పట్టుదలకు మారుపేరు భగీరథుడు


Ens Balu
4
Sarpavaram
2022-05-08 08:00:59

పట్టుదలకు మారుపేరు, సహనానికి ప్రతి రూపం, పరోపకారానికి పెట్టింది పేరు అయిన భగీరథుడు మహా జ్ఞాని అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి. కృష్ణ మోహన్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో మహర్షి భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  కృష్ణ మోహన్ మాట్లాడుతూ, వైశాఖ శుద్ధ సప్తమి రోజున భగీరథుడు జన్మించారని అన్నారు. అనుకున్న కార్యం సిద్ధించే వరకు పట్టువదలని విక్రమార్కుడు మహర్షి భగీరథ అని అన్నారు. కటోర శ్రమపడి గంగను దివి నుండి భువికి తీసుకు వచ్చాడని కృష్ణ మోహన్ తెలిపారు. భగీరధుడిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ కే వెంకటరమణ, అడబాల రత్న ప్రసాద్, ఓం నమశ్శివాయ , వెంకటేశ్వరరావు, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు