మహాయోగి విద్యారణ్య స్వామి
Ens Balu
4
Sarpavaram
2022-05-08 10:29:17
ఆదిశంకరుని అనంతరం ఆ స్థాయి వ్యక్తిగా పేరెన్నికగన్న విద్యారణ్యస్వామి బ్రహ్మ విద్య పారంగతుడు, వేదత్రయ భాష కర్త అని ఆధ్యాత్మికవేత్త హేమ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో విద్యారణ్య స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 1267 లో వైశాఖ శుక్ల సప్తమి రోజున ఆయన జన్మించారని అన్నారు. భారత జాతిని జాగృతి పరిచేందుకు అహరహం శ్రమించి, విశేష కృషి సల్ఫీ లక్ష్య సాధనలో సిద్ది పొందారని అన్నారు. ఆయన 1400 గ్రంథాలను రచించారని తెలిపారు. 1331 లో సన్యాసం స్వీకరించి శృంగేరి పీఠాధిపతి నిర్వహించారని అన్నారు. 1380 లో శృంగేరి పీఠాధిపతులై లౌకిక వైదిక అంశాలలో అసమాన ప్రతిభలై , మత రాజ్యాధరణ గావించినట్లు చారిత్రక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని హేమ తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరేష్ ప్రసాద్ ,అడబాల రత్న ప్రసాద్, కృష్ణ మోహన్, బాపిరాజు, ఓం నమశ్శివాయ తదితరులు పాల్గొన్నారు.