లాభదాయక ఉద్యాన పంటలకు ప్రతిపాదనలు..


Ens Balu
2
Paderu
2020-09-18 18:46:53

విశాఖ ఏజెన్సీలో గిరిజనరైతులకు లాభదాయకమైన వ్యవసాయ, ఉద్యానవన పంటలు సాగుచేయడానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని పాడేరు ఐటిడిఏ పీఓ డా. వెంకటేశ్వర్ సలిజామల స్పష్టమెనౖ ఆదేశాలు జారీ చేసారు. అధిక దిగుబడులు వచ్చి , మార్కెట్‌లో మంచి గిరాకి ఉన్న అవకాడో, లిచ్చిస్ , పైనా పిల్ మొక్కలు సరఫరా చేస్తామన్నారు. అదే విధంగా వ్యవసాయ ఆయిల్ ఇంజన్లు, పిచికారీ యంత్రాలు, తార్పాలిన్లు వంటి వ్యవసాయ ఉపకరణాలు రైతులకు ట్రైకార్ పధకంలో మంజూరు చేస్తామని చెప్పారు. శుక్రవారం ఐటిడి ఏ కార్యాలయపు సమావేశ మందిరంలో వ్యవసాయశాఖ , ఉద్యాన వనశాఖ, పశుసంవర్దక శాఖల అధికారులతో ట్రైకార్ పధకాల అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి కొంత మంది రైతులను ఎంపిక చేసి ఏజెన్సీ వాతావరణానికి అనుకూలమై ఉద్యాన మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు. రైతులకు ఎటువంటి పండ్లమొక్కలు సరఫరా చేస్తే ఉపయోగకంగా ఉంటాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఐటిడి ఏ సహాయ ప్రాజెక్టు అధికారి వి ఎస్ ప్రభాకరరావు, ప్రాజెక్టు ఉద్యాన వన అధికారి జి. ప్రభాకరరావు, కాఫీ సహాయ సంచాలకులు వి.రాధాకృష్ణ , వ్యవసాయశాఖ సహాయ సంచాలకలు రత్నకుమారి , ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు శైలజ, ఎపి ఎం ఐ పి ఎపిడి రహీమ్ ,పశుసంవర్దకశాఖ సహాయ సంచాలకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.