ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలి


Ens Balu
3
Seethanagaram
2022-05-10 11:14:25

ప్రసవాలు ఆసుపత్రుల్లో జరగాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.. బి. జగన్నాథ రావు అన్నారు.  జిల్లా టి. బి. నియంత్రణ  ఇన్ ఛార్జి అధికారి  డా|| సి హెచ్. విజయ కుమార్, డిప్యూటీ డి.ఎం.హెచ్. ఓ. డా..అనిల్ కలిసి సీతానగరం పి.హెచ్.సి, పెదంకలం పి.హెచ్.సిని సందర్శించారు. పెదంకలం పి.హెచ్.సిలో ప్రసవాలు ఆశించిన స్థాయిలో జరగక పోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రసవాలు, పనితీరు మెరుగు పడాలని ఆయన ఆదేశించారు. గర్భిణీగా ఉన్నప్పటి నుండే మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, సరైన సూచనలు, సలహాలు అందించి ఆసుపత్రిలో ప్రసవం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. నిర్మాణ దశలో వున్న  సీతానగరం పి.హెచ్.సిని సందర్శించి పనుల వివరాలను ఆరా తీశారు. నాడు- నేడు,  ఫీవర్ సర్విలెన్స్, మతా శిశు మరణాలు, అంటు వ్యాధులు,  ఎనీమియా ముక్త్ భారత్, కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం, సార్వత్రిక టీకాల కార్యక్రమం, టి బి కార్యక్రమం తదితర కార్యక్రమ నిర్వహణ గురించి ఆరా తీస్తూ వాటిని పక్కాగా చేపట్టాలని ఆయన ఆదేశించారు.
సిఫార్సు