పండించిన ధాన్యాన్ని నేరుగా రైతు భరోసా కేంద్రాల్లో విక్రయించాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి రైతులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మధ్య దళారీలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విక్రయించిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరుగుతాయని, టెక్నికల్ అసిస్టెంట్ పరీక్షలు చేసి తగిన ధర నిర్ణయిస్తారని చెప్పారు. ఉద్యమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు లో ఇది కూడా ఒక భాగమని తెలిపారు. కాబట్టి రైతులు అధికారుల సలహాలను పాటించి తమ పంటకు తగిన గిట్టుబాటు ధర పొందాలన్నారు. ఈ పర్యటనలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీలత, మండల వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.