అసనీని ఎదర్కోవడానికి నిశిరాత్రంతా అక్కడే


Ens Balu
11
Karapa
2022-05-10 17:22:51

అసని తుఫానును ఎదుర్కోవడానికి కరప మండల అధికారులు నడుంబిగాంచారు. నిశిరా త్రంతా కంటిమీద కునుకులేకుండా ఉప్పలంక గ్రామసచివాలయంలోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి అధికారులు ఆరోగ్యసిబ్బందితో సహా పనిచేశారు. ఎంపీడీఓ కె.స్వప్న, తహశీ ల్దార్ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్రకుమార్, వీఆర్వో వెంకటేశ్వర్రావు, సర్పంచ్ ఎన్.సతీష్ లతో కలిసి ప్రత్యేకంగా తుపాను ప్రత్యేక విధినిర్వహణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ స్వప్న మాట్లాడుతూ,  కరప మండలంలోని ఉప్పలంక తీరంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ఎవరూ భయపడాల్సిన పనిలేదని ఆమె భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలం మొత్తం అప్రమత్తం చేసినట్టు ఎంపీడీఓ వివరించారు. విద్యుత్ సౌకర్యం లేకపోతే ఇబ్బందులు రాకుండా మొబైల్ పవర్ బ్యాంకులతో సెల్ ఫోన్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసి మరీ రాత్రి కంట్రోల్ రూమ్ ను నిర్వహించారు. అంతేకాకుండా గ్రామంలో ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా తెలియజేసేవిధంగా గ్రామవాలంటీర్లను కూడా అప్రమత్తం చేసినట్టు ఆమె వివరించారు. ఎంపీడీఓ, తహశీల్ధార్ లు ప్రత్యేంగా తీర ప్రాంత ప్రజల కోసం 24గంటల పాటు రాత్రి సైతం లెక్కచేయ కుండా విధినిర్వహణ చేపట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.
సిఫార్సు