ఆ కుటుంబాలకు నేనుసైతం సాయం


Ens Balu
7
Koyyuru
2022-05-16 06:13:10

కొయ్యూరు మండలం లో వైద్యం వికటించి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన రెండు కుటుంబాలకు నేను సైతం ట్రస్ట్ వ్యవస్థాపకులు, అరకు ఎంపీ భర్త కుసిరెడ్డి శివప్రసాద్ అండగా నిలిచారు.. నేనున్నాను.. అంటూ  బాలరేవుల గ్రామానికి వెళ్లి ఆయా బాధిత కుటుంబాలను పరామర్శించారు.  జరిగిన సంఘటనపై తల్లిదండ్రులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని విచారం వ్యక్తం చేశారు. ఇలా ఏ కుటుంబానికి జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు నిత్యావసరాలు, కొంత ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామస్తులకు, బాధిత కుటు బాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. ఈ గ్రామంలో ఈ తరహా సంఘటనలుచోటుచేసుకొకుండా ఇప్పటికే కేజీహెచ్ నుంచి వైద్యుల బృందం ఈ గ్రామాన్ని సందర్శించి వారికి పూర్తిగా అవగాహన కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా బూదరాళ్ల  గ్రామస్తులు తెలిపిన తాగునీటి ఇబ్బంది పై తక్షణమే స్పందించిన ఆయన మినరల్ వాటర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై త్వరలోనే మినరల్ ప్లాంట్ ఇచ్చేందుకు ప్రకటించిన ఎంపి మాధవి, శివప్రసాద్ దంపతులకు బాలరేవుల ప్రజలు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 
సిఫార్సు