విధినిర్వహణలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయి..
Ens Balu
1
Srikakulam
2020-06-30 20:55:35
ప్రభుత్వ ఉద్యోగులు అందించిన సేవలే పదవికి గుర్తింపునిస్తాయని డిపిఆర్వో యల్.రమేష్ కొనియాడారు. పాలకొండ ఏపిఆర్వో గుర్రాల అప్పారావు పదవీ విరమణ కార్యక్రమం స్థానిక డి.పి.ఆర్.ఓ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా డిపిఆర్వో మాట్లాడుతూ, అప్పారావుకు ఏపని అప్పగించిన చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసి పూర్తి చేసేవారన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి సహనం, ఓర్పు అనేది ఉండాలని, అది ఆయన వద్ద చూసానని చెప్పారు. టైపిస్టుగా, సీనియర్ అసిస్టెంటుగా, సహాయ పౌర సంబంధాల అధికారిగా పనిచేసి పాలకొండ అదనపు పౌర సంబంధాల అధికారిగా పనిచేయడం ఆనందదాయకమన్నారు. ప్రతీ పనిని నేర్చుకోవలన్నా దృక్పథం ఆయన సొంతం అని, అలాగే అన్ని కళలు ఆయనకు వచ్చని శాఖలో పనిచేస్తున్న ప్రతీ ఉద్యోగి ఆయనను మార్గదర్శకంగా తీసుకోవాలని, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.