మంచినీటి కొళాయి పనులు వేగం పెంచాలి


Ens Balu
5
Amadalavalasa
2022-05-17 10:11:15

జల జీవన్ మిషన్ ద్వారా ఆమదాలవలస నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి మంచి నీటి కొళాయి పథకాన్ని సకాలంలో పనులు పూర్తి చేసి త్రాగు నీటిని అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆదేశించారు. ఆమదాలవలస స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో జరిగిన సమీక్ష సమావేశం లో ఆమదాలవలస నియోజవర్గం లో జన జీవనం ద్వారా జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 275 గ్రామాలకు గాను 221 గ్రామాలు టెండర్లు పూర్తిచేసుకొని పనులు ప్రారంభ దశలో ఉన్నాయాన్నారు, 20 గ్రామాల్లో ఇంటిoటికి మంచి నీటి కొళాయి పనులు పూర్తి చేసుకొని ప్రారంభ దశలో ఉన్నాయన్నారు.  మండలంలో బెల్లమం, లోద్దల పేట గ్రామాలలో పనులు జరుగుతున్నాయని అధికారులు తెలియజేశారు. అదేవిధంగా ఆమదాలవలస మండలానికి సంబంధించి 51 గ్రామాలకు మరియు బూర్జ మండలం సంబంధించి 77 గ్రామాలకు నారాయణపురం నుండి మంచి నీటిని లిఫ్ట్ చేసుకునే విధంగా సుమారు 100 కోట్లతో జరుగు పనులకు ప్రతిపాదనలు పంపించామన్నారు.  పొందూరు మండలం లో 60 కోట్లతో 75 గ్రామాలకు గండ్రేడు నుండి  మంచి నీటిని లిఫ్ట్ చేసుకునే విధంగా మరియు సరుబుజ్జిలి మండలం సంబంధించి 60 కోట్లతో 75 గ్రామానికి సంబంధించి తెలిగి పెంట వద్ద ఉన్న కెనాల్ నుండి మంచి నీటిని లిఫ్ట్ చేసుకునే విధంగా ప్రతిపాదనలు పంపించామన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  జనజీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని అందించాలనే దృడ సంకల్పంతో ఉన్నారని ఆయన అన్నారు. ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఎందరో మహిళలు మంచినీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు. పనులు వేగవంతం చేయాలని ఇంటింటికి మంచి నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో ఎస్ ఈ పి సూర్యనారాయణ, డి ఈ ఈ లలిత కుమారి, జె ఈ ఈ అబ్బాస్,మౌళి,పూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు